విలియం మెక్ గ్వెైర్ బ్రెైసన్ అమెరికాలో పుట్టినా, బతుకంతా యుకెలో గడిచింది. హాస్యం, యాత్ర, చరిత్రలు, సైన్స్ గురించి అతను రాసిన పుస్తకాలకు గొప్ప పేరు, అవార్డులు వచ్చాయి. డర్వాం యూనివర్సిటీకే అతను ఛాన్సలర్ గా ఉన్నాడు. సైన్స్ చరిత్ర గురించి అతను రాసిన పుస్తకం చాలా గొప్ప పేరు పొందింది. ద బాడీ గురించి రాస్తూ ఆదునిక విజ్ఞానం గురించి, అందరికీ అర్థమయ్యే పద్ధతిలో ఇంతకన్నా మంచి పుస్తకం మరొకటి రాలేదు అన్నారు.