ఇది కృష్ణ యజుర్వేదమునకు, అథర్వణవేదమునకు అనుబంధమై ఉన్నది. కొన్నిచోట్ల ఈ ఉపనిషత్తు, ‘సర్వసారోపనిషత్తు’ అనీ, ‘సర్వోపనిషత్తు’ అనీ ‘సర్వోపనిషత్సారమ’నీ పిలువబడింది. అంటే, అన్ని ఉపనిషత్తుల సారము ఈ ఉపనిషత్తులో ఉన్నదని అర్థము. వేదముల సారము ఉపనిషత్తులైతే, ఉపనిషత్తుల సారమంతా దీనిలో ఉన్నది. ఈ విధంగా చూచినప్పుడు, దీనియొక్క విశిష్టత అర్థమౌతుంది.
సత్యనారాయణ శర్మగారు వేదాంతము, యోగము, తంత్రము, జ్యోతిష్యశాస్త్రం, వీరవిద్యలు, మరియు ప్రత్యామ్నాయ వైద్యవిధానములలో లబ్దప్రతిష్ఠులు. భారతదేశము మరియు అమెరికా సంయుక్త రాష్ట్రములలో వీరిచే స్థాపించబడిన ‘పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్’ ప్రపంచవ్యాప్తంగా వేలాదిమందిని వెలుగుదారులలో నడిపిస్తున్నది. వీరి ఇతర రచనలైన, శ్రీవిద్యా రహస్యమ్, లలితా సహస్రనామ రహస్యార్థ ప్రదీపిక, దత్తాత్రేయ యోగశాస్త్రము, జాబాల దర్శనోపనిషత్తు, మహాసౌరము, విజ్ఞానభైరవ తంత్రము, మహాస్మృతిప్రస్థానసూత్రము, ధమ్మపదము, యోగకుండలినీ ఉపనిషత్తు, యోగతత్త్వోపనిషత్తు, యోగశిఖోపనిషత్తు, యోగతారావళి, శాండిల్యోపనిషత్తు, వరాహోపనిషత్తు, ఆరు యోగోపనిషత్తులు, నాదబిందూపనిషత్తు, ధ్యానబిందూపనిషత్తు, సిద్ధసిద్ధాంతపద్ధతి, గోరక్షసంహిత, యోగయాజ్ఞవల్క్యము, పతంజలి యోగసూత్రములు, వైద్యజ్యోతిష్యం - మొదటి భాగం, వెలుగుదారులు, శ్రీమాలినీ విజయోత్తర తంత్రము, తంత్రసారము, ఆత్మబోధ, అపరోక్షానుభూతి, దృగ్దృశ్య వివేకము, ప్రాణాగ్నిహోత్ర ఉపనిషత్ లు ఆధ్యాత్మిక జ్ఞాననిధులుగా చదువరులచే కొనియాడబడుచున్నవి.