దుఃఖము నశించాడానికి అభ్యాసము గావించబడే ధ్యానవిధానమే బుద్ధభగవానుని ధ్యానము. తాను కనుగొనిన ఈ వినూత్న ధ్యానమార్గము పైన బుద్ధభగవానుడు చేసిన ఉపదేశములు అనేకములు త్రిపిటకములలో ఉన్నవి. వీటిలో 'మహాస్మృతిప్రస్థాన సూత్ర' మనబడే ఈ ఉపదేశము చాలా ముఖ్యమైనది. ఎందుకనగా, తన ధ్యానమార్గమును గురించిన ఆచరణాత్మకములైన ఉపదేశములను బుద్ధభగవానుడు ఇందులో చేశాడు. త్రిపిటకములలోని దీర్ఘనికాయములో గల 'మహావర్గము' అనబడే గ్రంథములో ఈ ఉపదేశములు మనకు లభిస్తున్నాయి.
శ్రీ సత్యనారాయణ శర్మ గారు జ్యోతిష్యము, యోగము, తంత్రము, వీరవిద్యలు, ప్రత్యామ్నాయ వైద్యవిధానములలో ప్రవీణులు. భారతదేశముననూ, అమెరికా సంయుక్తరాష్ట్రలలోనూ వీరు స్థాపించిన 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' ప్రపంచవ్యాప్తంగా వేలాదిమందిని ఆధ్యాత్మికమార్గంలో ఉత్తేజితుల్ని చేస్తున్నది.